FbTelugu

17 వేల కుటుంబాలకు అండగా దేవరకొండ!

కరోనా వైరస్ బారి నుండి మనల్ని రక్షించడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కొన్ని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసంయాక్టర్ విజయ్ దేవరకొండ స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్.. మిడిల్ క్లాస్ ఫండ్ అనే ఇనీషియేటివ్ ను ప్రారంభించి మధ్యతరగతి వారికి అండగా నిలిచింది.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ ఫౌండేషన్ కార్యకలాపాల్లో అనునిత్యం యాక్టివ్ గా ఉంటుండడం గమనార్హం. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా విజయవంతంగా 17,723 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఇందుకోసం 1.7 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా 58,808 కుటుంబాలకు సమయానికి సహాయం అందగా, 8,505 వాలంటీర్లు ద్వారా 1.5 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. కరోనా క్రైసిస్ ను ఎదుర్కోవడానికి ఈ ఇనీషియేటివ్ తీసుకోవడం జరిగింది, అయితే లాక్ డౌన్ 5.0 రూల్స్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమ పని చేసుకోవడానికి, బిజినెస్ లు ఆరంభించుకోవడానికి వెసులుబాటు కల్పించడంతో.. జూన్ 2 నుండి ఫౌండేషన్ ఆపరేషన్స్ ను నిలిపివేయడం జరిగింది.

ఫౌండేషన్ కార్యకలాపాల్లో పారదర్శకత కొరకు ప్రతి పనికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్ మరియు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ వచ్చాము. ఇంతకుమునుపు, ఫౌండేషన్ ద్వారా చాలామంది యువకుల కెరీర్ కు “First Job Program” ఇనీషియేటివ్ ద్వారా సహాయపడడం జరిగింది.
మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ దేవరకొండకు కుటుంబ నిత్యావసరాలు, బాధలు తెలుసు. ఈ సంకట సమయంలో తన బాధ్యతను చాటుకున్నాడు. విజయ్ ను చూసి ఇన్స్పైర్ అయిన చాలామంది ఫండ్స్ రూపంలో ఫౌండేషన్ కు అండగా నిలిచారు.

దేవరకొండ ఫౌండేషన్ కు సహాయం కోసం అర్జీ పెట్టుకొన్న ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ను చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి మరీ సహాయం అందించడం ద్వారా పెట్టుబడిని వేస్ట్ చేయకుండా ఫండ్స్ & డొనేషన్స్ ద్వారానే అవసరార్థులకు సహాయం అందించడం విశేషం.ఫౌండేషన్ అభ్యర్ధన మేరకు కార్పొరేట్ సంస్థలకు చెందిన 535 మంది వాలంటరీగా సహాయం చేయడానికి ముందుకొచ్చి కష్టకాలంలో వేల కుటుంబాలకు బాసటగా నిలిచారు. పేరుప్రఖ్యాతులు ఆశించకుండా కేవలం అవసరార్థులకు సహాయపడాలని తపనతో విజయ్ దేవరకొండ స్థాపించిన ఈ ఫౌండేషన్ లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన తీరు, ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అవుతూ మధ్యతరగతి కుటుంబాలకు వెన్నుముకలా నిలిచిన విధానం ప్రశంసనీయం.

కరోనా క్రైసిస్ ను ఎదుర్కోవడానికి ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ను.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ 5.0తో ఇచ్చిన సడలింపులతో ప్రజలు మళ్ళీ సాధారణ జీవితాలు ప్రారంభించడానికి వెసులుబాటు ఉండడంతో.. జూన్ 2 నుండి ఫౌండేషన్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నాం. ప్రభుత్వం అందించే సహాయాన్ని అందుకోలేని మిడిల్ క్లాస్ మరియు వర్కింగ్ క్లాస్ కు తోడుగా నిలుస్తూ.. పారదర్శకతతో దేవరకొండ ఫౌండేషన్ వ్యవహరించిన తీరు అందరి మనసులను గెలుచుకొంది. అయితే.. ఈ విజయ్ గాధ ఇక్కడితో ముగియడంలేదు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన ఆలోచనలతో, మరింత మందికి చేరువయ్యే దీర్ఘకాలిక ప్రయోజనాలతో విజయ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.