FbTelugu

రెండు చోట్లా టీఆర్ఎస్ కు మెజారిటీ

హైదరాబాద్: మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్ నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ లో 86 మంది అభ్యర్థుల తొలగింపు తరువాత కౌంటింగ్ ముగిసేసరికి లభించిన 2వ ప్రాధాన్యత ఓట్లు ఇవే. టీఆఆర్ఎస్ అభ్యర్థికి 2354, బీజేపీ 1897, నాగేశ్వర్ 2132, కాంగ్రెస్ కి 1325.

ఇప్పటి వరకు పోలయిన ఓట్లు టీఆర్ఎస్1,15,043, బీజేపీ 1,06,565, నాగేశ్వర్ 55,742, కాంగ్రెస్ 32,879 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి 8478 ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు. అదే విధంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో రెండో విడతలో 66 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి 115588, చింతపండు నవీన్ కుమార్ 90379, ఎం.కోదండరాం 75575, బీజేపీ 41328, కాంగ్రెస్ అభ్యర్థికి 29441 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 25209 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.