FbTelugu

ఆన్ లైన్ లో మంచాలు, వెంటిలేటర్ల వివరాలు

అమరావతి: జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రుల్లో శనివారం రాత్రి 7.30 గంటల వరకు 24,738 బెడ్ల తో పాటు 1,171 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 3,847 బెడ్స్ తో పాటు 23 వెంటిలేటర్స్, విజయనగరం లో 1,258 బెడ్స్, 15 వెంటిలేటర్లు, విశాఖపట్నం లో 4,456 బెడ్స్ తో పాటు 207 వెంటిలేటర్లు, తూర్పు గోదావరి లో 1,813 బెడ్స్, 60 వెంటిలేటర్స్, పశ్చిమ గోదావరి లో 1,369 బెడ్స్,15 వెంటిలేటర్లు, కృష్ణా లో 1,736 బెడ్స్, 117 వెంటిలేర్స్, గుంటూరు జిల్లాలో 1,496 బెడ్స్, 186 వెంటిలేర్స్, ప్రకాశం లో 114 బెడ్స్, 96 వెంటిలేటర్లు, నెల్లూరు లో 1073 బెడ్సు, 167 వెంటిలేటర్లు, వైఎస్సార్ లో 385 బెడ్స్, 52 వెంటిలేర్లు, అనంతపురం లో 1854 బెడ్సు,16 వెంటిలేటర్లు, చిత్తూరు జిల్లాలో 3,002 బెడ్స్ తో పాటు 122 వెంటిలేటర్లు, కర్నూలు జిల్లాలో 2,335 బెడ్స్ తో పాటు 95 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ సమాచారాన్ని ప్రజలకు నేరుగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed_reports/ ను ఏర్పాటు చేసిందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఖాళీ బెడ్ల వివరాలు తెలుసుకోవచ్చని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

You might also like