FbTelugu

దారుణం.. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం

నెల్లూరు: గత కొన్ని రోజులుగా.. దేవాలయాల్లోని విగ్రహాలపై ఆకతాయిల దాడులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పంచాయతీలోని తుమ్మూరులో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

తోకభాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.