FbTelugu

వేధింపులతో డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య

సిరిసిల్ల: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఎస్.బి.ఐ డిప్యూటీ మేనేజర్ మాచర్ల వెంకన్న (37) ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త ఆత్మహత్యకు పై అధికారులే కారణమని ఆయన భార్య పద్మ ఆరోపించింది.

ముస్తాబాద్‌ ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కమలాపూర్‌ మండలంలోని మాదన్నపేటకు చెందిన మాచర్ల వెంకన్న(37) ముస్తాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోత్గల్‌ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రెండు వారాలు సెలవులో వెళ్లిన ఆయన శనివారం తిరిగి విధుల్లో చేరారు. సోమవారం ఉదయం బ్యాంకు సమయం దాటినా రాకపోవడంతో అధికారులు, సిబ్బంది వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంటికి తరలివెళ్లారు. కిటికిల్లోనుంచి చూడగా ఆయన అచేతనంగా పడివున్నాడు.
పురుగుల మందు తాగినట్లు గుర్తించి, స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెంటనే తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి సిద్దిపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బ్యాంక్‌ అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెంకన్న భార్య పద్మ ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చట్టరీత్యా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమారుడు సాయితేజ, కూతురు దీక్షిత ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.