FbTelugu

మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి

నెల్లూరు: ఏపీ టూరిజం హోటల్ లో డిప్యూటీ మేనేజర్ మహిళా ఉద్యోగిపై దారుణానికి తెగబడ్డాడు. మాస్క్ వేసుకోవాలని చెప్పిన పాపానికి ఆమెపై భౌతిక దాడికి దిగాడు.

కరోనా నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరూ మాస్క్ లు ధరించగా, డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కచ్చితంగా మాస్క్ ధరించాలని ఉద్యోగి ఉషారాణి చెప్పగా, తనకే నీతులు చెబుతావా అంటూ ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు.

ఈలోగా సహచర ఉద్యోగులు అతన్ని వారించి బయటకు పంపించారు. భాస్కర్ దాడిలో ఉషారాణి గాయపడింది. బాధితురాలు సహచర ఉద్యోగులతో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీసీటీ ఫుటేజీ ఆధారంగా భాస్కర్ పై కేసు నమోదు చేసి భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు.

You might also like