FbTelugu

ఫార్మాసిటీ ఘటనపై డిప్యూటీ సీఎం దిగ్బ్రాoతి

విజయవాడ: విశాఖపట్నం ఫార్మాసిటీలో పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఆళ్ల నాని స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.

పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను అదేశించారు. ఎవరికీ ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

You might also like