FbTelugu

సీఎం ఇంటి ముందు డిప్యూటీ సీఎం ధర్నా

న్యూఢిల్లీ: సీఎం ఇంటి ముందు డిప్యూటీ సీఎం ధర్నా అంటే అదేదో గొడవ అనుకోవద్దు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధర్నా చేశారు.
కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలతో ఆయన సీఎం నివాసం ముందు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ ను హౌస్ అరెస్టు చేసినందుకు నిరసనగా ఢిల్లీ పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ధర్నా జరిగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. తమకు మద్దతు పలకాల్సిందిగా రైతు సంఘాలు సీఎం కేజ్రీవాల్ ను కోరాయి.

ఇదే సమయంలో ఏడు క్రీడా మైదానాలను జైళ్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించగా, సీఎం కేజ్రీవాల్ అంగీకరించలేదు. ఈ విషమాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెట్టుకున్న కేంద్రం ఆయనను గృహ నిర్భంధం చేసింది. ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధర్నా చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.