FbTelugu

ఢిల్లీ పౌరులందరికీ ఫ్రీ వ్యాక్సిన్: డిప్యూటీ సీఎం మనీష్

న్యూఢిల్లీ: ఢిల్లీ పౌరులందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి పౌరుడికి ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

వ్యాక్సినేషన్ కోసం ఈ బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు 45వేల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని ఆ సంఖ్యను త్వరలో 60వేలకు పెంచుతామన్నారు. 162 ఆసుపత్రులలో ఇస్తుండగా, ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు 56 వరకు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వయో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఇస్తున్నామని, ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం రూ.250 చొప్పున ఒక డోసుకు వసూలు చేస్తున్నారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.