FbTelugu

భారత్ బయోటెక్ బాబు కులం వాళ్లదే: ఆళ్ల నాని

అమరావతి: రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ల కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటి సిఎం ఆళ్ నాని ఆరోపించారు.

ఈ విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమంపై మంత్రివర్గ ఉప సంఘం ఇవాళ ఆళ్ల నాని అధ్యక్షతన ఇవాళ భేటీ అయ్యింది. సమావేశం ముగిసిన తరువాత ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులానికి చెందినదని, కుల బంధుత్వాన్ని ఉపయోగించి ఏపికి వ్యాక్సిన్లు ఇప్పిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అందరికి ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడేది లేదని ఆయన అన్నారు. కేంద్రం ఎన్ని లక్షల డోసులు ఇచ్చినా పంపిణీ చేసి ప్రజలకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకే రోజు 6 లక్షల డోసులు వేసిన ఘనత ఏపి వైద్య ఆరోగ్య శాఖదని ఆళ్ల నాని వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.