FbTelugu

ఉపముఖ్యమంత్రి మామ సంచలన కామెంట్స్

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా.. అర్హులకు పథకాలు అమలు చేయడానికి అధికారులు పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని అన్నారు.

పుష్ప శ్రీవాణి నియోజకవర్గాన్ని అధికారులకు అసలు పట్టించుకోవడం లేదన్నారు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. అవకాశం వున్నా జలవనరుల శాఖ తాగునీటి సమస్యను పరిష్కారం చేయలేక పోతోందన్నారు. నాణ్యమైన రోడ్లు కూడా వేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో పూర్తిపింఛన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు.

You might also like