హైదరాబాద్: పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా పతనమయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం ధర 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ.300 క్షీణించింది.
వెండిపై ఏకంగా రూ.1500 కు పడిపోయి రూ.68,000 వద్ద నిల్చిపోయింది. బంగారం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం మూలంగా ధరలు పతనమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ 0.07 శాతం పెరుగుదలతో 1839 డాలర్లకు చేరగా, వెండి ఔన్స్ కు 0.10శాతం పెరుగుదలతో 24.01 డాలర్ల వద్ద ఆగిపోయింది.