FbTelugu

శ్రీశైలం కళ్యాణ కట్ట వద్ద భక్తుల బైఠాయింపు

కర్నూలు: లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో తెలంగాణ నుంచి శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తలనీలాలు సమర్పించేందుకు కళ్యాణ కట్ట వద్దకు చేరుకున్న భక్తులకు నిరాశ ఎదురైంది. సోమవారం నాడు తెరవకపోవడంతో భక్తులు అక్కడే బైఠాయించారు.

సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం, తలనీలాలు సమర్పించేందుకు వస్తే కేశ ఖండన కేంద్రాన్ని మూసివేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియడంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు హుటాహుటిన కల్యాణ కట్ట వద్దకు చేరుకున్నారు. కరోనా కారణంగా కల్యాణ కట్ట మూసివేశామని, అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా కోరారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు వెలువడలేదని, అందుకే మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అధికారుల వినతితో భక్తులు తలనీలాలు సమర్పించకుండానే ఛౌల్ట్రీలకు వెళ్లి, స్నానాలు ముగించుకుని దర్శనానికి వెళ్లారు. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో, ఏపిలో ఆంక్షలు సడలించడంతో భక్తుల రాక పెరిగిందని దేవస్థానం అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.