FbTelugu

టెన్త్ విద్యార్థులకు సహకరించాలి: విద్యాశాఖ

అమరావతి: పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు సహకరించాలని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు సూచనలు జారీచేసింది. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్‌ మార్గాల ద్వారా సహకరించాలని కోరింది.

విద్యార్థులకు ఆన్‌లైన్ మార్గాల ద్వారా సందేహాలు తీర్చాలని, జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలలకు రిపోర్టు చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా సూచనలు చేసింది. పరీక్షల నిర్వహణ, సందేహాల నివృత్తి కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లకు సూచించింది. పదో తరగతి విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధం కావాల్సిందిగా విద్యాశాఖ స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.