FbTelugu

ఈఎస్ఐ స్కామ్‌ లో బెయిల్ తిరస్కరణ

అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులకు ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న పిటిషన్లను హైకోర్టు తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

ఈఎస్ఐ కుంభకోణం లో ఏ9, ఏ10 గా ఉన్న రవి తేజశ్రీ, యశస్వీ లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదే కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యానాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, మాజీ పీఏ మురళి మోహన్ లు పిటీషన్లు వేశారు. వీరిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది. వీరితో కలిసి మొత్తం నలుగురు ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

You might also like