FbTelugu

సచివాలయం భవనాల కూల్చివేత షురూ

హైదరాబాద్: ఒక చరిత్ర కనుమరుగైపోతున్నది. ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ లకు గూడునిచ్చిన సచివాలయం నేలమట్టమైపోతున్నది.

పాత సచివాలయ భవనాలకు తొలగింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కూల్చివేత పనులు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య నలువైపులా దారులను మూసివేసి ఆర్ అండ్ బీ శాఖ కూల్చివేత పనులు షురూ చేసింది. వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు. కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
కూల్చివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రెండు వారాల్లో పూర్తి చేసి భూమిని పూర్తిగా చదును చేయనున్నారు. బీఆర్ కేఆర్ భవనంలోని సచివాలయ ఉద్యోగులకు ఒకరోజు తాత్కలిక సెలవు ఇచ్చారు. విధులకు రావాల్సిన అవసరం లేదంటూ అర్థరాత్రి సమాచారం పంపించారు. కొత్త సచివాలయం డిజైన్ ఖరారు అయ్యింది. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పనులు ప్రారంభించనున్నారు. ఏడాది లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

telangana secretariat

ఇదీ చరిత్ర…

* హైకోర్టు తీర్పుతో కూల్చివేత కు వేగంపెంచిన తెలంగాణ ప్రభుత్వం.

* భూమిపూజ చేసిన ఏడాది తర్వాత కూల్చివేత ప్రారంభం

* 132 ఏండ్ల ఘన చరిత్ర

* నిజాం నవాబు ల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలువురి ముఖ్యమంత్రుల పాలనా కేంద్రం

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి పాలనా కేంద్రం

* 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లింది

* 25 ఎకరాల విస్తీర్ణంలో.. 10లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం

* 132ఏండ్ల కాలంలో 10 బ్లాకుల నిర్మాణం

* అతిపురాతన మైన జీ బ్లాక్ 1888లో ఆరవ నిజాం నవాబు కాలంలో నిర్మాణం

* 2003లో డి బ్లాక్ , 2012లో నార్త్ , సౌత్ బ్లాక్స్ ప్రారంభం

* అన్నీ హంగులతో నూతన సచివాలయం నిర్మాణంకు రంగం సిద్ధం

* రూ.500 కోట్ల వ్యయంతో నూతన సచివాలయం నిర్మాణం

* ఆరు లక్షల చదరపు అడుగుల్లో నూతన సచివాలయం

* సీఎం, మంత్రులు, అధికారులతో సమావేశం కోసం అధునాతన హాల్స్

* మంత్రుల పేషీలోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్ లు.

You might also like

Leave A Reply

Your email address will not be published.