FbTelugu

ఎస్సైని సస్పెండ్ చేయాలంటూ ఆందోళన

విశాఖ: కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ వ్యక్తిని ఎస్సై అకారణంగా కొట్టాడంటూ.. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలంటూ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగిన ఘటన జిల్లాలోని కె.కొటపాడు మండలం, ఎ.కోడూరు పోలీసు స్టేషన్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ వ్యక్తిపై ఎస్సై సతీష్ దుర్బాషలాడి, అకారణంగా చేయిచేసుకున్నాడంటూ కొంతమంది స్టేషన్ ముందు తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

You might also like