FbTelugu

స్పెషల్ సాంగ్ కు రూ.1.5 కోట్లు డిమాండ్

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం పుష్పలో స్పెషల్ సాంగ్ కోసం ఒక హీరోయిన్ ను ఎంపిక చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఈ చిత్ర వస్తున్నది. పాన్ ఇండియా కథాంశంతో పలు భాషల్లో విడుదల కానున్నది.

బాలీవుడ్ నటీమణి దిశా పటానీతో స్పెషల్ సాంగ్ చేయించేందుకు నిర్మాతలు, దర్శకుడు ప్రయత్నం చేశారు. ఆమె ను సంప్రదించగా ఓకే చెప్పింది కాని, డిమాండ్ చూసి కంగుతిన్నారంట. పుష్పలో స్పెషల్ సాంగ్ చేసేందుకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈమె బాఘీ 3 లో డూ యూ లవ్ మీ అంటూ ప్రత్యేక పాటలో తన అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఈ అమ్మడు చేసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే పటానీ రేటుతో పుష్ప చిత్ర నిర్మాతలు పునరాలోచనలో పడ్డారంటున్నారు. ఆమెను తీసుకుంటారా లేదా వేరే హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తారా అనేది త్వరలోనే తెలియనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.