FbTelugu

తమిళనాడులో గాడిదలు, గుర్రాలకు డిమాండ్

చెన్నై: గుర్రాలు, గాడిదలకు డిమాండ్ ఎందుకు పెరిగిందని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మరి. ఎన్నికల అధికారులు వీటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అదేంటో చూద్దాం మరి.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. తేని జిల్లాలో వాహనాలు వెళ్లలేని గిరిజన గ్రామాలు ఉన్నాయి.

ఈ గ్రామాలకు ఈవీఎంలతో పాటు, ఎన్నికల సరంజామా, నీళ్ల బాటిళ్లు తరలించడానికి గాడిదలు, గుర్రాల అవసరం వచ్చింది. 30కి పైగా గ్రామాలు ఉండడంతో 30 గుర్రాలు, 30 గాడిదల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. గిరిజన గ్రామాలు కావడంతో వందశాతం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల పాటు అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఎంత ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.