FbTelugu

అయోధ్య స్టాంపులకు యమ డిమాండ్

లక్నో: అయోధ్య రామ మందిరం స్టాంపులకు యమ డిమాండ్ పెరుగుతోంది. దేశా విదేశాల నుంచి పలువురు తమకు అయోధ్య స్టాంపులు కావాలని స్థానిక పోస్టల్ అధికారులకు ఫోన్ చేస్తున్నారు.

రామ మందిర నిర్మాణం భూమి పూజ రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రాముడు తపాల బిళ్లను విడదుల చేశారు. రాముడి జీవితం ఆధారంగా తీసుకొచ్చిన పోస్టల్ స్టాంపులు హాట్ కేకుల మాదిరి అమ్ముడవుతున్నాయి. భావి తరాలకు వీటిని చూపించేందుకు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
వీటి కోసం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని లక్నో పోస్టల్ డిపార్ట్ మెంట్ రీజియన్ డైరెక్టర్ కెకె.యాదవ్ తెలిపారు. ఒక స్టాంప్ ధర రూ.25గా నిర్ణయించామన్నారు. డిమాండ్ కు తగ్గట్లుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

You might also like