FbTelugu

మూడు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ దడ దడ!

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు. కాని పలు రకాలుగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ డెల్టా ఫ్లస్ రూపంలో మూడు రాష్ట్రాలకు పాకింది.

మహారాష్ట్రలో 21 పాజిటివ్ కేసులు డెల్టా ఫ్లస్ రకంతో నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే సోమవారం నాడు ప్రకటించారు. మహారాష్ట్రతో పాటు కేరళ, మధ్యప్రదేశ్ లో డెల్టా ప్లస్ రకాలతో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రస్టుగా పరిగణించామని, ఆందోళనకర వేరియంట్ గా పరిగణించలేదని నీతి ఆయోగ్ సభ్యుడు వికె.పాల్ ఇటీవ తెలిపారు. డెల్టా ప్లస్ సమాచారం కోసం చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రత్నగిరిలో 9 కేసులు, జల్గాంవ్ లో 7, ముంబయి లో 2, థానే, సింధు దుర్గ్, పాల్ఘార్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మే 15వ తేదీ నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా 21 కేసులు వెల్లడయ్యాయి. ఈ కేసులు బయటపడడంతో మహారాష్ట్రకు మూడో ముప్పు ఉందని అంచనాకు వచ్చి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేరళలో కూడా మూడు కేసులు, మధ్యప్రదేశ్ లో ఒక కేసు వెలుగు చూసింది. అయితే ఈ వేరియంట్ కాక్ టేల్ ఔషధానికి కూడా లొంగకుండా ఏమార్చుతుందనే నివేదికలు వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ర్యాపిడ్ యాంటిజెన్, ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టుల్లో కూడా బయటపడడం లేదని, హెచ్.ఆర్.సి.టి పరీక్షతోనే కేసులు వెల్లడవుతున్నట్లు సమాచారం. ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినా డెల్టా ప్లస్ సోకినట్లుగానే భావించాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.