FbTelugu

డెల్టా షాక్… మహారాష్ట్రలో ఆంక్షలు కఠినం

ముంబయి: డెల్టా ప్లస్ ముప్పు తప్పేట్టు లేదని గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో తలెత్తిన విపత్కర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వ్యూహంతో ముందుకు వెళ్తున్నది.
కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రాంతాల వారీగా అన్ లాక్ చేయడంతో పాటు ఆంక్షలను సడలించింది.

డెల్టా ప్లస్ వైరస్ తో మరణం చోటు చేసుకోవడం, 20 కేసులు రాష్ట్రంలో నమోదు కావడంతో అప్రమత్తమైంది. ఆంక్షలు మరింత కఠినం చేయాలని, ఏమరుపాటుగా ఉండవద్దని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఆంక్షలు సడలించడం అంటే కేసులు పెంచుకోవడం కాదని స్పష్టం చేసింది. వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. తాజా ఆదేశాల ప్రకారం ఫూణె, థానే తో సహా అన్ని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో లెవల్-3 ఆంక్షలు అమలుచేయనున్నారు. ఇంతకు ముందు అనుమతించిన మాల్స్, థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పబ్బులు మళ్లీ మూసివేస్తారు. చిన్న దుకాణాలు, ఇతర కార్యకలాపాలు సాయంత్రం నాలుగు గంటలకే పరిమితం చేశారు. సాయంత్రం నాలుగు తరువాత లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.