FbTelugu

డెల్టా ఫ్లస్… 4 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో డెల్టా ప్లస్ కేసుల ఉధృతి పెరుగుతోంది. మంగళవారం వరకు 22 కేసులు నమోదు కాగా బుధవారం నాటికి ఆ కేసుల సంఖ్య 40 చేరుకున్నది. ఇండియాలో డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి.

ఈ కొత్తరకం వైరస్ ను కేంద్ర ప్రభుత్వం ఆందోళనకర రకం గా ప్రకటించింది. ఈ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు సోకిన వారు తొందరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. డెల్టాప్లస్ రకం వైరస్ తో ప్రధానంగా బ్రిటన్ తో పాటు పలు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 21 కేసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 6, కేర‌ళ‌లో 3, త‌మిళ‌నాడులో 10 కేసులు న‌మోదు అయినట్ల సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.