FbTelugu

ఈ విపత్తుకు ఆల్ఫా కాదు డెల్టా నే!

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ ఉధృతిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయించింది. దేశంలో వెలుగు చూసిన బి.1.617 విభాగంలోని మూడు రకాల వైరస్ లలో డెల్టా నే ప్రధాన కారణమని తేలింది.

బ్రిటన్ దేశంలో వెలుగు చూసిన ఆల్ఫా కంటే డెల్టా అత్యంత ప్రమాదకరని తేల్చింది. దేశంలో 12,200 రకాలు ఉండగా వాటిలో డెల్టానే ప్రమాదకరని అంటున్నారు. జన్యుక్రమ విశ్లేషణపై జాతీయ క్షయవ్యాధి నియంత్రణా కేంద్రం, ఇండియా జినోమిక్ కన్సార్షియం సంయుక్తంగా అధ్యయనం చేశాయి. అన్ని రాష్ట్రాల్లో డెల్టానే ప్రాణాలకు ముప్పు తెస్తున్నదని పరిశీలనలో వెల్లడైంది. వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభమైన తరువాత ఆల్ఫా రకం తగ్గిపోగా, డెల్టా మాత్రం విజృంభిస్తుండడం గమనార్హం. మొత్తం 29వేల నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ చేయగా 8900 నమూనాల్లో బి.1.617 రకాలు ఉన్నాయి. ఈ 8900 నమూనాల్లో వేయికి పైగా నమూనాల్లో డెల్టా రకం బయటపడింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని గురించే చెప్పింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.