FbTelugu

ఆక్సిజన్ అడ్డుకుంటే ఉరి తీస్తాం: ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకుంటే ఉరితీస్తామని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇతర రాష్ట్రాలలో ఢిల్లీ కి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకుంటున్న వారి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కరోనా కేసులు, పరిస్థితి పిటీషన్ పై విచారణ జరపింది. ఢిల్లీలో రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా ఆ మేరకు సరఫరా చేయడం లేదని సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని నగరంలో ఆక్సిజన్ అందక పలువురు చనిపోతున్నారు. లక్ష మంది కరోనా రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.