FbTelugu

హీరోయిన్ కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: పక్కా ఆధారాలు లేకుండా 5వ జనరేషన్ మొబైల్ టెక్నాలజీపై ఫిర్యాదు చేసిన జూహిచావ్లా కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టేయడంతో పాటు రూ.20 లక్షల అపరాధ రుసుం కూడా విధించింది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అప్ గ్రేడ్ కావాల్సిందేనని, ముందుగా ప్రభుత్వానికి లేఖ రాయకుండా కోర్టు మెట్లు ఎక్కడంపై మండిపడింది. 5జి టెక్నాలజిని వ్యతిరేకిస్తూ జూహి చావ్లా పిటీషన్ దాఖలు చేసింది. కొత్తగా వచ్చే టెక్నాలజితో తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధృవీకరించే వరకు ఆపాలని కోరింది. సుమారు 5వేల పేజీలతో కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాలను చేర్చుతూ పిటీషన్ వేసింది. పబ్లిసిటీ కోసమే వేశారని, ఆధారాలు లేకుండా వేసిన ఆమె పిటీషన్ కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. అదే విధంగా కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహి అభిమాని సినిమా పాటలు విన్పించడం, ప్రొసీడింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసినందకు హైకోర్టు ఆమెపై సీరియస్ కావడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.