FbTelugu

వైసీపీ, సీఈసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఢిల్లీ: ఏపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా పిటీషన్ దాఖలు చేశారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ తన పార్టీ పేరును అక్రమంగా వాడుకుంటున్నదంటూ మహబూబ్ బాషా హైకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని రిజిష్టర్ చేయించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రచారం చేసుకుంటున్నారని పిటీషన్ లో తెలిపారు. పార్టీ లెటర్ హెడ్స్, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజా ప్రాతినిధ్యం చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో విన్నవించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.