FbTelugu

కళ్ల ముందు కంపెనీ… వ్యాక్సిన్లు లేవంటారా?: హైకోర్టు

హైదరాబాద్: దేశంలో కోట్ల కొద్దీ వ్యాక్సిన్ డోసులు తయారు చేసే ఫార్మా కంపెనీలు ఉండగా వ్యాక్సిన్లు ఉండగా విదేశాల వైపు చూస్తున్నామని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
హిమాచల్ ప్రదేశ్ బద్దీ ఫార్మా సెజ్ లో ఉన్న పనేసియా కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పంచాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ విచారణ సందర్భంగా జడ్జిలు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నజ్మీర్ తో కూడిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది.

రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ఇండియాలోని పనేసియా కంపెనీని తమ స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎంపిక చేయడాన్ని ప్రస్తావించింది. రష్యా దేశం వాళ్లకు ఇండియాలో ఉన్న ఫార్మా కంపెనీ సత్తా తెలుసుకాని మన కేంద్రం పెద్దలకు తెలియదని నిందించింది. ఏటా 10 కోట్ల వ్యాక్సిన్ల తయారీకీ పనేసియా తో రష్యా డెరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం కూడా కేంద్రానికి తెలుసు. కరోనా నియంత్రించాలంటే వ్యాక్సిన్లు మాత్రమే శరణ్యం అని చెబుతున్న కేంద్రం వాటి కొరత తీర్చేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వదిలేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గతంలో ఇన్ ప్లుయంజా వ్యాక్సిన్ల వ్యవహారంలో కేంద్రానికి, పనేసియా కంపెనీ మధ్య వివాదం నడిచింది. పనేసియాలకు రూ.14 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ట్రిబ్యునల్ కేంద్రాన్ని 2019లో ఆదేశించింది. ఈ నిధులను వడ్డీతో సహా చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినా కేంద్రం అమలు చేయలేదు. అలాంటి కంపెనీలను వదిలేసి వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ఆ బకాయిలు చెల్లించి, పనేసియా కు అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇవ్వాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ల ఉత్పత్తికి స్థానిక ప్రభుత్వం అనుమతులు పొందాలని హైకోర్టు సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.