FbTelugu

విదేశాల్లో బిజెపి గొప్పలు… ఇక్కడ వ్యాక్సిన్ తిప్పలు: శిసోడియా

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు 76 దేశాలకు కరోనా వ్యాక్సిన్లు ఎగుమతి చేసి భారతీయులకు తీవ్ర అన్యాయం చేసిందని ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ శిసోడియా ఆరోపించారు.

విదేశాల్లో గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడి ప్రజలను మాత్రం చంపేస్తున్నదని ఆయన విమర్శించారు. తాము కోరినంతగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ ను కోరగా నిరాకరించిందని ఆయన అన్నారు. ఉత్పత్తి, డిమాండ్, విదేశాలకు ఎగుమతులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల మూలంగా సరఫరా చేయలేకపోతున్నామని భారత్ బయోటెక్ వెల్లడించిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఆ సంస్థ రాసిన లేఖను శిసోడియా ట్విటర్ వేదికగా రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పేరుతో ఢిల్లీకి కోవాగ్జిన్ సరఫరా చేయడం లేదన్నారు. ఈ కారణంగానే ఢిల్లీలో 17 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేయక తప్పలేదన్నారు. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా, కేంద్రం అడ్డుపుల్లలు వేసే ప్రమాదముందని మనీష్ శిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.