FbTelugu

వ్యాక్సిన్ల కొరతకు కేంద్రమే కారణం: ఢిల్లీ సిఎం

న్యూఢిల్లీ: దేశ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేయించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం సక్రమంగా లేదని ఆయన ఆరోపించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆలస్యం లేనట్లయితే సెకండ్ వేవ్ వ్యాప్తి ఇంత ఘోరంగా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ పై పాకిస్థాన్ దాడికి దిగితే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సొంతంగా ఆయుధాలు, యుద్ద ట్యాంకులు కొనుగోలు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్లు సమీకరించుకునేందుకు అన్ని రాష్ట్రాల సిఎం లు నానా తంటాటు పడుతున్నారని, ఇప్పటి వరకు ఏ ఒక్క కంపెనీ సరఫరా చేసేందుకు ముందుకు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్లు విక్రయించే అధికారం లేకపోవడమే కారణమన్నారు. కేంద్ర చట్టాల మూలంగానే రాష్ట్రాలకు విదేశీ కంపెనీలు వ్యాక్సిన్లు నిరాకరిస్తున్నాయని ఆయన వివరించారు. అందుకే గ్లోబల్ టెండర్లకు ఎవరూ స్పందించడం లేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.