FbTelugu

ఢిల్లీ లో రోడ్డెక్కిన బస్సులు

ఢిల్లీ: ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ ప్రభుత్వం నగరంలో బస్సులు నడుపుకునేందుకు అనుమతించింది. గత 56 రోజులుగా తిరగకుండా ఉన్న బస్సులు ఇవాళ ఉదయం రోడ్డెక్కడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే కేవలం నగరం లోపల తిరిగేందుకు మాత్రమే బస్సులకు అనుమతిచ్చారు. ఉద్యోగాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉండడంతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం  అనుమతిచ్చింది. నిజానికి ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ.. ప్రజల కష్టాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని నగరంలో బస్సులకు పర్మిషన్ ఇచ్చారు.ఇవాళ మొత్తం 3400 డీటీసీ బస్సులు రోడ్డెక్కాయి. మెట్రో రైళ్లు మాత్రం అనుమతించలేదు.

ప్రైవేట్ వాహనాలు, ఆటోలు కూడా తిరిగేందుకు పర్మిషన్ ఇచ్చారు. ప్రైవేట్ ఆఫీసులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే రెస్టారెంట్లు ఫుడ్‌ని హోం డెలివరీ చేయడానికి అనుమతిచ్చారు.. కానీ రెస్టారెంట్లు మాత్రం తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

You might also like