FbTelugu

పోలీసుల ముందే నిందితుడి హత్య

లక్నో: నేరాలు, ఘోరాలకు పేరు మోసిన ఉత్తరప్రదేశ్ లో ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితుడిని శిక్షించారు. ఈ ఘటన కుషినగర్ జిల్లాలో సోమవారం జరిగింది.
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం తారియా సుజన్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంపూర్ బాంగ్రా ప్రాంతంలో టీచర్ సుధీర్ సింగ్ ఒక వ్యక్తి కాల్చిపారేశాడు. చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత అతడు ఇంటి పై కప్పు మీదకు ఎక్కి గాలిలోకి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు చేరుకున్నారు.

టీచర్ నే చంపేస్తావా అంటూ గ్రామస్థులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని, అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని తీసుకుని వెళ్తుండగా స్థానికులు అడ్డుపడి విచక్షణ రహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గకుండా, చనిపోయాడని నిర్థారించుకున్న తరువాత శాంతించారు. గ్రామస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినోద్ కుమార్ మిశ్రా తెలిపారు.

You might also like