FbTelugu

కర్నూలులో పరువు హత్య

కర్నూలు: ఆదోని లో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని తమ కుమార్తె వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
పోలీసుల కథనం ప్రకారం ఆదోని పట్టణంలోని కిష్టప్ప నగర్ కు చెందిన ఆడం స్మిత్ ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్నాడు.

ఆదోనికే చెందిన ఒక యువతి ఇతని ప్రేమలో పడింది. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. రెండు నెలల క్రితం ఇద్దరు హైదరాబాద్ ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు.
ఆ తరువాత నూతన దంపతులు కిష్టప్ప నగర్ లోనే నివాసం ఉంటున్నారు. ఇవాళ ఆసుపత్రిలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆడం స్మిత్ ను ఆర్టీసి కాలనీ వద్ద కాపుకాసి దాడికి దిగారు. ఇనుపరాడ్లు, బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తమ తల్లిదండ్రులే తన భర్తను హత్య చేయించారని భార్య ఆరోపించింది. ఘటనా స్థలానికి టూ టౌన్ పోలీసులు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.