FbTelugu

నెటిజనులకు అడ్డంగా దొరికిన దీపికా పదుకోనే !

దీపికా పదుకోనే నెటిజనుల చేతికి అడ్డంగా దొరికిపోయింది. ‘ఇంత మతిమరుపు ఐతే ఎలా అమ్మ’ అంటూ నెటిజన్లు దీపికాను ఓ ఆట పట్టిస్తున్నారు. డిప్రెషన్‌ పట్ల అవగాహన కల్పించడం కోసం దీపికా ‘లీవ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోకొన్ని రోజుల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘లెక్చర్‌ సిరీస్‌’ కార్యక్రమానికి సోదరి అనిశా పదుకోనేతో కలిసి హాజరయ్యారు దీపికా. అక్కడ దీపికా మాట్లాడుతూ.. “నిజ జీవితంలో నేను ఎన్నో పాత్రలు పోషించాను. ఓ కుమార్తె, ఓ సోదరి, ఓ నటిగా” అని చెబుతూ తర్వాతి పదాల కోసం వెతుక్కుంటోంది. పక్కనే ఉన్న వారు అది గమనించి “ఓ భార్యగా” అని అందించారు. అప్పుడు దీపికా ‘ఆ ఓ భార్యగా’ కూడా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత “నేను ఓ భార్యను కూడా కదా! ఆ విషయం నేను మర్చిపోయాను” అంటూ దీపికా నవ్వుకుంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దాంతో దీపికా పదుకోనే ఇలా నెటిజనుల చేతికి అడ్డంగా దొరికిపోయింది

You might also like