FbTelugu

రేపు ఒక్కరోజు దీక్ష, 18న సడక్‌ బంద్‌

Deeksha-is-one-day-tomorrow-Sadak-Bandh-on-the-18th

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి కేసీఆర్ తన పట్టు వీడడంలేదు. మరో పక్క ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించడం లేదు. నిన్న చలో ట్యాంక్ బండ్ ను నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. అఖిలపక్ష భేటీలో అశ్వత్తామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకులు నలుగురు రేపు ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగుతారని, ఈ నెల 18న సడక్‌ బంద్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు.

నిన్న జరిగిన దమనకాండపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. రేపు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు ఉంటాయని, నిన్న జరిగిన దమనకాండను ఖండించాలని డిమాండ్ చేశారు.13, 14న ఢిల్లీలో మానవహక్కుల కమిషన్ ను, మహిళా కమిషన్ ను కలుస్తామన్నారు. ఆ తర్వాత పోలీసుల దమనకాండ, ప్రభుత్వ వేధింపులపై ఫోటో ఎగ్జిబిషన్ పెడతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకువచ్చి చర్చలు జరిపేలా కృషి చేయాలి. నిన్న కేవలం ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు మాత్రమే పాల్గొన్నాయి. మావోయిస్టులు పాల్గొన్నారని పోలీసులు తప్పుగా అపాదించవద్దని అశ్వత్థామ రెడ్డి కోరారు.

You might also like