హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సింటమ్స్ లేని వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం లేదంటూ.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న చోట అందరికీ కరోనా టెస్టులు చేయాలని బీజేపీ నేత రేణుకా చౌదరి అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో టీఆర్ఎస్ ఎనలేని కృషి చేస్తోందని అన్నారు.
రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సిఉన్నా.. ప్రజల ప్రాణాలే ముఖ్యంగా భావించి తెలంగాణ ప్రభుత్వం అహర్నిషలు పోరాడుతోందని అన్నారు. ప్రతిపక్షాలు సేవలు చేయకపోయినా, తమ సేవలను గుర్తించకపోయినా పర్వాలేదు కాని అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు.