FbTelugu

వకీల్ సాబ్ కు తగ్గుతున్న వసూళ్లు

కరోనా మహమ్మారి ప్రభావం వకీల్ సాబ్ సినిమా ప్రదర్శన, కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నది. సినిమా విడుదల అయిన తరువాత మొదటి ఐదు రోజులు అభిమానులు, జనం ఎగబడి చూశారు.

సినిమా బాగుందనే టాక్ రావడంతో పలువురు సినిమా హాళ్లకు పరుగులు తీసి వీక్షించారు. వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రావడం కూడా కలిసి వచ్చింది. బుధవారం నుంచి అనూహ్యంగా కలెక్షన్లు తగ్గడంతో డిస్ట్రిబ్యూటర్లు కంగుతిన్నారు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. మధ్యాహ్నం షో లు కూడా 50 శాతం మించి చూడలేదని లెక్కలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే రూ.76 కోట్లు వసూలు చేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తున్నది. ఎవరికీ నష్టం లేకుండా లాభాల్లో ఉండాలంటే కనీసం రూ.90 కోట్లు వసూలు చేస్తే తప్ప సాధ్యం కాదని అంటున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరో వారం రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఈ మాత్రం ఆడిందంటే ఆయనకున్న స్టార్ ఇమేజ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.