FbTelugu

ఏపిలో తగ్గుతున్న కేసులు

అమరావతి: ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ రేటు 25% నుండి 9.5% కు తగ్గింది. గత 24 గంటల్లో 83461 మందికి పరీక్షలు నిర్వహించగా 7943 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 98 మంది మరణించారు.

గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1877 అత్యధిక కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 15 మంది మరణించినట్లు ఏపి వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 153795 ఉన్నాయి. ఇప్పటివరకు 10930  మంది మృతి చెందగా 15.27 లక్షల మంది రికవరీ  అయ్యారు. వారం రోజుల క్రితం వరకు కూడా రోజు 20వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.