FbTelugu

తగ్గుతున్న కరోనా.. పెరుగుతున్న పోలీసు కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న లాక్ డౌన్ కఠిన చర్యల కారణంగా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజురోజుకి కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

ఇదే క్రమంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే దాదాపు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లన్నీ వాహనాలతో నిండి పోయాయి. తాజాగా సీజ్ చేస్తున్న వాహనాలను భద్రపరిచేందుకు పోలీసులకు స్థలం సరిపోవడం లేదు. ప్రతి రోజూ వేల సంఖ్యలో వాహనాపై కేసులు నమోదౌతున్నాయి.

You might also like