FbTelugu

ఏపిలో తగ్గుతున్న కరోనా కేసులు

అమరావతి: లాక్ డౌన్ పుణ్యమా అని ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 58,835 నమూనాలను పరీక్షించగా 12,994 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్రంలో తాజాగా 96 మంది చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,93,921కి చేరగా, కరోనా నుంచి 13,79,837 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,03,821 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 10,222 మంది మృతి చెందారు. నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,86,76,222 నమూనాలను పరీక్షించారు. వ్యాక్సిన్ల కొరత కారణంగా పలు కేంద్రాలలో నో స్టాక్ అనే బోర్డు పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.