FbTelugu

లాక్ డౌన్ తో తగ్గుతున్న కేసులు

న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో దేశంలో క్రమంగా యాక్టీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల కన్పిస్తున్నది.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,40,842 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,741 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న 3,55,102 మంది కరోనా బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లగా ప్రస్తుతం 28,05,399 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్నవారు 2,34,25,467 మంది కాగా, వైరస్ సోకి ఇప్పటివరకు 2,99,266 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,65,30,132. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 88.30% మరణాల రేటు 1.13% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.