FbTelugu

ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

న్యూఢిల్లీ: లాక్ డౌన్, కఠిన నిబంధనలు అమలు చేయడంతో ఢిల్లీలో క్రమంగా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పడుతున్నది. తాజాగా 1,649 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది మార్చి తరువాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

గత 24 గంటల్లో 189 మంది కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఢిల్లీలో మార్చి 30వ తేదీన 992 పాజిటివ్ కేసులు రాగా, ఏప్రిల్ 1వ తేదీకే 2,790 కేసులు నమోదు అయ్యాయి. ఇక అప్పటి నుంచి కేసులు పెరగడంతో పాటు మరణాలు పెరిగాయి. దీనికి తోడు ఆక్సిజన్ లభించక పదుల సంఖ్యలో మరణించడం దేశంలోనే సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాలో వివక్ష పాటిస్తున్నదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గత మూడు రోజులుగా 3వేలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 1,649 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. కేసులు తగ్గుతున్న లాక్ డౌన్ ను కూడా ఈ నెలాఖరు వరకు పొడిగించారు. మూడో విడత నుంచి ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ తెలిపారు. వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు జరుపుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.