FbTelugu

గణేష్ ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి గణేష్ ఉత్సవాల నిర్వహణపై బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సారి 21 అడుగులకు ఎత్తుకు బదులు 6 అడుగుల ఎత్తు విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం నిర్వహించే లడ్డూ వేలం కూడా ఈ ఏడాది నిర్వహించడం లేదని తెలిపింది. మొదటి పూజ  కేవలం కమిటీ  సభ్యుల అద్వర్యం లో జరుగుతుందని తెలిపారు. అలాగే భక్తులు ఎలాంటి పూజలు, దర్శనాలు చేసుకునేందుకు అనుమతి లేదని తెలిపింది. ప్రతి సంవత్సరం జరిగే గణేష్ శోభా యాత్ర కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని తెలిపింది.

You might also like