FbTelugu

నేటి క్యాబినెట్ లో కరోనాపై నిర్ణయాలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఉదయం 11గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కానున్నది. ప్రధానంగా కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు.

కరోనా ఉధృతి నేపథ్యంలో రేపటి నుండి రాష్ట్రంలో కర్ఫూ అమలు, ఆసుపత్రులలో పడకల పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆక్సిజన్ సరఫరా, రెమెడెసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేంద్రం ప్రకటించిన విధంగా 18 నుండి 45 సంవత్సరాలు మధ్య వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపును పరిశీలించనున్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి బిడ్ల ఖరారుపై, భూసేకరణలో ఎస్సీ, ఎస్టీలకు 10శాతం అదనంగా పరిహరం చెల్లింపు చర్చించి తీర్మానం చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.