FbTelugu

ఎంపి సిఎం చౌహాన్ భేషైన నిర్ణయం

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా మహమ్మారితో అనాధలైన పిల్లల విషయంలో భేషైన నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారారు.
కరోనా వైరస్ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీర్మానించింది.

చిన్నారులకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్ తో పాటు ఉచిత విద్య అందించనున్నారు. వారి కుటుంబాలకు ఉచిత రేషన్ అందచేయనున్నారు. కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం పూచికత్తుగా ఉండి రుణాలు ఇప్పించనున్నది.
మధ్యప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉంది. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి పలువురు చిన్నారులు అనాధలుగా మారుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.