FbTelugu

తెలంగాణ లాక్ డౌన్ పై 30న నిర్ణయం?

హైదరాబాద్: లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 30న సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంతో పాటు మరో మూడు నాలుగు అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు లాక్ డౌన్ ను రెండుసార్లు పొడిగించారు. ఈ నెలాఖరుకు ముగియనున్నది. అయితే లాక్ డౌన్ ఆపేసి రాత్రి కర్ఫ్యూ విధిస్తారా లేదా కొనసాగిస్తారా అనేది వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖలకు మాత్రం జూన్ 7 వరకు పొడిగిస్తున్న మౌఖిక ఆదేశాలు వెళ్లాయంటున్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సమావేశంలో ప్రధానంగా కరోనా కేసులు, లాక్ డౌన్ పై చర్చించనున్నారు. ధాన్యం సేకరణ, వ్యవసాయం, కల్తీ విత్తనాల నిరోధం పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.