FbTelugu

పుదుచ్చేరి పై నేడు నిర్ణయం?

పుదుచ్చేరి: బలపరీక్షకు ముందే ప్రభుత్వం పడిపోవడంతో లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
సభ్యుల బలం లేకపోవడంతో సీఎం నారాయణ స్వామి రాజభవన్ వెళ్లి లెప్టినెంట్ గవర్నర్ కు రాజీనామా లేఖ ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు, త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వవచ్చని అంటున్నారు.

అయితే ఎన్.ఆర్ కాంగ్రెస్ కూటమికి అవకాశం ఇస్తారా.. లేక గవర్నర్ పాలనపై మొగ్గు చూపుతారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. తమిళిసై నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా, ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.