FbTelugu

8న జరిగే కేబినెట్ లో లాక్ డౌన్ పై నిర్ణయం?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరుగనున్నది.

రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగింపు, వైద్యం, కరోనా వైరస్, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏజెండా అంశాలు గా నిర్ణయించారు. థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత పై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. లాక్ డౌన్ పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్షించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.