FbTelugu

ఇంటర్ ప్రాక్టికల్ పై కీలక నిర్ణయం

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేకపోవడంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 29 నుంచి జూన్ 7వరకు జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేసింది.

కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ప్రాక్టికల్స్ వాయిదా వేశామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది రెండు వారాల ముందుగానే పత్రికాముఖంగా ప్రకటన ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.