FbTelugu

మాస్క్ లేకుంటే రూ.200 జరిమానా: పంచాయతీల తీర్మానం

అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుంటే రూ.200 వరకు జరిమానా విధించాలని ఏపిలో గ్రామ పంచాయతీల తీర్మానం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో గ్రామ పంచాయతీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరు మాస్కు పెట్టుకోవాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నాయి.

వీధుల్లోకి వచ్చినా, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లినా, కార్యక్రమాలకు వెళ్లినా తప్పకుండా మాస్కు ధరించాల్సిందేనని, ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించకతప్పదని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 70 శాతం పంచాయతీలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. రెండో దశలో గ్రామాల్లోకి వైరస్ పాకడంతో అప్రమత్తమవుతున్న పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి కట్టడికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పగలు 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.